Home / ANDHRAPRADESH / టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఫైర్..జాగ్రత్తగా మాట్లాడండి !

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఫైర్..జాగ్రత్తగా మాట్లాడండి !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసారు. అసెంబ్లీ వైసీపీ కార్యాలయంగా మార్చారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణపై  తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని అలా ఆరోపించడం సరికాదని అన్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే టీడీపీ నుండి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ కోరిక మేరకు ఆయనకు సెపరేట్ సీటు ఇవ్వడానికి స్పీకర్ అంగీకరించారు.అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇలానే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, అందులో తానూ భాగస్వామినేనని, దానికి తగిన శిక్షగా తనను 15 ఏళ్ల పాటు అధికారానికి దూరం చేశాడని తమ్మినేని చెప్పడం విశేషమని అనాలి.