Home / MOVIES / గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విజయ్ దేవరకొండ

గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విజయ్ దేవరకొండ

వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫేమస్ వరల్డ్ లవర్ మూవీలో నటిస్తున్న విజయ్ త్వరలోనే బాలీవుడ్ గేటును తాకనున్నాడు.

ఈ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసుకోనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫైటర్ మూవీని తెలుగు,హిందీ లతో పాటుగా పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు.

ఫైటర్ కథ పాన్ ఇండియా సినిమాకు సరిపోతుందని భావించిన కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నాడు.