Home / ANDHRAPRADESH / మార్షల్స్‌ మీద చంద్రబాబు దౌర్జన్యంపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ఏమన్నారంటే

మార్షల్స్‌ మీద చంద్రబాబు దౌర్జన్యంపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ఏమన్నారంటే

అసెంబ్లీలో నిన్న భద్రతా సిబ్బందిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తించిన ప్రవర్తనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు. రోజూ తాను రావాల్సిన గేటులో కాకుండా చంద్రబాబుగారు మరో గేటులో వచ్చారు.. గేటు నంబర్‌ –2 ద్వారా ఆయన రావాల్సి ఉంటుంది.. గేటు నంబర్‌–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు ఇలా అందరితోపాటు ఒక ఊరేగింపుగా గేట్లలోనుంచి వచ్చారు.. సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాల్సిన ఉన్న నేపథ్యంలో మార్షల్స్‌ ప్రవేశద్వారం వద్ద నియంత్రణలు పెట్టారు. ఆ గేట్లలో నుంచి ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఎవరు సభ్యుడు, ఎవరు సభ్యుడు కాదు అని చూసుకుని లోపలికి పంపించేందుకు కొన్ని భద్రతా నిబంధనలు పెట్టారు.

 

 

ఈ విషయంలో మార్షల్స్‌ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. మొత్తం దృశ్యాలన్నీ చూస్తే.. ఎవరు, ఎవరిమీద దౌర్జన్యం చేశారో అర్థం అవుతోంది. చంద్రబాబు గారు నోట్లో నుంచి వచ్చిన మాట ‘‘బాస్టర్డ్‌’’ అని, ఒక ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబుగారు బాస్టర్డ్‌ అన్నారు.. దీనికి ఆయన సిగ్గుపడాలి.. ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుని బాస్టర్డ్‌ అని అనడం అంటే ఎంత దారుణం.. లోకేష్‌ అనే వ్యక్తి నాలుగు అడుగులు ముందుకు వేసి ఏకంగా అధికారులను గొంతుపట్టుకున్నారు..ఇష్టం వచ్చినట్టు తిట్టారు.. ఎవరు ఎవరిమీద దౌర్జన్యం చేస్తున్నారు.. ఇది చాలా తప్పు అని సీఎం అన్నారు.