Breaking News
Home / 18+ / కండల వీరుడిగా సాయిధరమ్ తేజ్..!

కండల వీరుడిగా సాయిధరమ్ తేజ్..!

ఈ తరం తెలుగు హీరోల్లో సిక్స్ ప్యాక్ బాడీ లేనివారు ఉండరనడం అతిశయోక్తి కాదు. ప్రభాస్, ఎన్టీఆర్ మొదలుకొని ఈ మధ్యే వచ్చిన కార్తికేయ వరకు టాలీవుడ్ లో దాదాపు యంగ్ హీరోలు అంతా కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. మెగా హీరోలు రామ్ చరన్, బన్నీల తరువాత సాయి ధరమ్ తేజ్ ఈ బాట పట్టాడు ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ తన బాడీని ఎక్స్ పోజ్ చేసింది లేదు. మొదటి సారి తన బాడీని షో చేసేందుకు ప్రతి రోజు పండుగే సినిమాను ఎంచుకున్నాడు ఈ మెగా హీరో. మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ప్రతి రోజు పండుగే’ సినిమాను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు అని చెప్పేందుకు ఈ స్టిల్ ను విడుదల చేసినట్లు తెలుస్తుంది.

 

 

బ్యాక్ నుండి తేజ్ కండలు చూపిస్తూ విడుదల చేసిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా రాశిఖన్నా కనిపించబోతుంది. ఈ సినిమాతో తేజ్ మరో సక్సెస్ కొట్టడం ఖాయం అంటూ చాలా నమ్మకంగా చెబుతుంది చిత్రబృందం.