Home / INTERNATIONAL / మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస గెలుపుకు ఎన్నారైల ప్రత్యేక కృషి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి22న జరగనున్న ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల గెలుపుకు ఎన్నారై తెరాస యుకే  ప్రత్యేక  కృషి చేస్తుందని అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మీడియాకు తెలిపారు.
 
నేడు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ దేశాల్లో ఎంతో మంది ప్రవాసబిడ్డలు స్థిరపడ్డారని, నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కెసిఆర్ గారి వెంటే ఉంటూ వారి నాయకత్వాన్నీ బలపర్చుతున్నారని, అదే స్పూర్తితో నేటి మున్సిపల్ ఎన్నికల్లో సైతం మీ కుటుంబసభ్యులకి , మిత్రులకి ఫోన్ చేసి తెరాస అభ్యర్థుల గెలుపుకు కృషి చెయ్యాలని ఖండాంతరాల్లో నివసిస్తున్న ఎన్నారైలకు  పిలుపునిచ్చారు.
 
 ఎన్నికలేవైనా ఎన్నారై తెరాస సభ్యులు  క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే, అలాగే నేటి మునిసిపల్ ఎన్నికల్లో సైతం ప్రత్యేక ప్రణాళికతో తెరాస అభ్యర్థుల గెలుపుకోసం లండన్ బృందం కృషిచేస్తుందని అశోక్ గౌడ్ తెలిపారు.