Home / MOVIES / “సరిలేరు నీకెవ్వరు”లో అదరగొట్టిన విజయశాంతి

“సరిలేరు నీకెవ్వరు”లో అదరగొట్టిన విజయశాంతి

దాదాపు పదమూడేళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ రోజు శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు మూవీతో లేడీ మెగాస్టార్ విజయశాంతి తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఒకప్పుడు ఒకవైపు అందాలను ఆరబోస్తూనే మరోవైపు చక్కని యాక్షన్ సినిమాలతో హీరో కమ్ హీరోయిన్ అన్నట్లు అప్పటి టాప్ హీరోలందరికీ పోటీగా నటించింది అలనాటి అందాల ఈ తార. అయితే చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తనలో ఏ మాత్రం నటన చావలేదు. తాను ఏమి తక్కువ కాదు ..

నేను ఎప్పటికి లేడీ మెగాస్టార్ నే అని నిరూపించుకుంది. ఈ మూవీలో ప్రొఫెసర్ పాత్రలో భారతిగా విజయశాంతి ఒక మోస్ట్ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. హీరో మహేష్ బాబుతో పోటీగా కొన్ని కొన్ని చోట్ల చాలా చక్కగా నటించింది.

విలన్ ప్రకాష్ రాజ్ కు సవాళ్లు విసిరే సన్నివేశాల్లో విజయశాంతి నభూతో న భవిష్యత్ అన్నట్లు నటించి వహ్వా అన్పించుకున్నారు.విజయశాంతి డైలాగ్ డెలివరీ ,డిక్షన్ తెరపై చూస్తుంటే అప్పటి విజయశాంతిని గుర్తుకు తెచ్చారు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి మీరు చూడండి మరి పదమూడేళ్ల తర్వాత లేడీ మెగాస్టార్ ఎలా నటించారో..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat