Home / ANDHRAPRADESH / నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా ఈ నెలలో ఉన్న సంక్రాంతి పండుగను జరుపుకోవడంలేదు అని అన్నారు.రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆదివారం ఉదయమున నాగులమ్మకు ఆమె మొక్కులు తీర్చుకున్నారు.

అనవాయితీ తప్పకూడదనే ఉద్ధేశ్యంతోనే మొక్కులు తీర్చుకున్నాము.అమరావతి రైతులు బాధల్లో ఉంటే మేము ఎలా పండుగ చేసుకుంటాము.రైతులకు అండగా ఉండాలని సంక్రాంతి పండుగ చేసుకోవడంలేదు అని ఆమె చెప్పారు..