టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.
అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం.
గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ తగిలింది. అది కాస్త స్పైడర్ మూవీ సమయంలో ఆపరేషన్ చేయించుకున్నారు.
తాజాగా ఆ నొప్పి మళ్లీ మొదలు కావడంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై మహేష్ కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారకంగా ప్రకటించలేదు.