Home / BAKTHI / సమ్మక్క దేవతగా ఎలా మారింది..?

సమ్మక్క దేవతగా ఎలా మారింది..?

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది.

అయితే సమ్మక్క దేవతగా ఎలా మారిందో తెలుసుకుందాము.. గిరిజన రాజ్యంలో సమ్మక్క అపురూపంగా పెరుగుతుంది. సమ్మక్క ఎవరికి ఏ ఆపద వచ్చిన సరే తన చేతి స్పర్షతో ఆ ఆపదను మటుమాయం చేసేది.

ఏ కష్టం చెప్పుకున్న కానీ ఆ కష్టాన్ని సమ్మక్క తీర్చేది. అలా అత్యంత శక్తివంతమైన సమ్మక్క కోయరాజ్యానికి దేవతగా మారిపోతుంది.

వయసులోకి వచ్చిన సమ్మక్కను మేడరాజు తన మేనల్లుడైన పడిగిద్దరాజుకు ఇచ్చి పెళ్ళి చేస్తాడు.వారికి జంపన్న ,సారలమ్మ ,నాలుగులమ్మ అనే పిల్లలు పుడతారు. సారలమ్మను గోవిందరాజుకు ఇచ్చి పెళ్ళి చేస్తారు.