Home / BAKTHI / మేడారం జాతర జనసంద్రం

మేడారం జాతర జనసంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు.

వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం ఈ జాతర ముగియనున్నది.