Home / ANDHRAPRADESH / మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు

మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు.

ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయని ప్రముఖ తెలుగు మీడియా పత్రికలో కథనాలు వెలువడ్డాయి.ఐటీ అధికారులు శ్ర్తీనివాస్ కు చెందిన పలు ఇండ్లపై నిర్వహించిన సోదాల్లో 2014, 2015, 2016, 2017, 2018, 2019 సంవత్సరాలకు సంబంధించిన డైరీలను స్వాధీనం చేసుకుంది.

వాటిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు ఏయే కాంట్రాక్టు సంస్థల నుంచి ఏ తేదీన ఎంత మొత్తంలో ఏయే సబ్‌ కాంట్రాక్టర్ల పేర్లతో కమీషన్‌ల రూపంలో వసూలు చేసిందీ.. వాటిని ఏయే సంస్థలకు మళ్లించిందీ.. నల్లధనాన్ని ఎలా విదేశాలకు మళ్లించిందీ.. చంద్రబాబు కుటుంబ సంస్థలకు నగదు రూపంలో వచ్చిన వివరాలు.. చంద్రబాబు, లోకేష్‌లకు నగదు రూపంలో ఇచ్చిన వివరాలు ఆ డైరీల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తుంది .వీటి ఆధారంగా ఐటీ శాఖ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో రూ.రెండు వేల కోట్ల నల్లధనం కుంభకోణం బయటకు వచ్చిందని ఆ పత్రికల కథనాల సారాంశం.