Home / MOVIES / ఎన్టీఆర్ పై పవన్ ప్రశంసలు

ఎన్టీఆర్ పై పవన్ ప్రశంసలు

జనసేన అధినేత ,ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. దివంగత మాజీ సీఎం నందమూరి తారకరామారావుపై ప్రశంసలు కురిపించారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” రాజకీయాల్లో ఓటమి అనేది సహజం.

ఓటమికి కృంగిపోయే మనస్తత్వం తనది కాదు అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” పార్టీ పెట్టగానే అధికారంలోకి రావడం అందరి వలన కాదు.

అది కేవలం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం. అంత సత్తా ఆయనకే ఉంది అని ఆయన ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను మాత్రం చాలా దూర దృష్టితో ఆలోచించే పార్టీ పెట్టానని ఆయన తెలిపారు.