Home / CRIME / టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు

టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది.టీవీ సౌండ్ పెంచాలన్న భయం వేసిన సంఘటన ఇది. ఆర్మూర్ లో రాజేంద్ర (40)ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు.

వీరు పెద్దగా అరుచుకుంటుండడంతో రాజేంద్ర టీవీలో సరిగ్గా వినిపించడంలేదు అని టీవీ సౌండ్ పెంచాడు. దీంతో సౌండ్ ఎందుకు పెంచావని ఓనరుతో గొడవకు దిగాడు బాలనర్సయ్య.

ఈ క్రమంలో రాజేంద్ర తలపై బలంగా కొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. పోలీసులు నిందితుడు బాలనర్సయ్య కోసం గాలిస్తున్నారు.