Home / SLIDER / సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు

సచిన్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు

టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. లెజండ్రీ సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరిచిపోలేని రోజు నేడు. సరిగ్గా ఏనిమిదేళ్ల కిందట అంటే ఇదే రోజు మార్చి 16,2012లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఇదే రోజు ఢాకాలో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచులో 114పరుగులు చేయడంతో సచిన్ అరుదైన ఈ ఫీట్ ను సాధించాడు. అంతకుందు మార్చి 2011లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో 99శతకం పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత ఏడాది అంటే 2013లో జరిగిన వెస్టీండిస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు సచిన్.