Home / ANDHRAPRADESH / అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం

అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం

ఏపీలో అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద రోడ్డుప్రమాదం సంభవించింది.

కళ్యాణదుర్గం – రాయదుర్గం ప్రధాన హైవే రోడ్‌లో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరి మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు