Home / ANDHRAPRADESH / నాలో నాతో YSR పుస్తకం ఆవిష్కరణ

నాలో నాతో YSR పుస్తకం ఆవిష్కరణ

అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ రాసిన ‘నాలో, నాతో YSR’ అనే పుస్తకాన్ని ఏపీ సీఎం YS జగన్ ఆవిష్కరించారు.

ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఈ పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘వైఎస్ఆర్ ఎంతోమంది జీవితాల్లోకి వచ్చారు.

ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపారు.ఆయన అందరితో ఎలా ఉండే వారో నాకు తెలుసు.ఆయనను దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఈ పుస్తకం రాశాను’ అని అన్నారు.