Home / NATIONAL / హోం క్వారంటైన్ లో ఆ రాష్ట్ర సీఎం

హోం క్వారంటైన్ లో ఆ రాష్ట్ర సీఎం

దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.చిన్న పెద్దా తేడా లేకుండా అందరికీ కరోనా సోకుతుంది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ సిని క్రీడా ప్రముఖులకు కూడా కరోనా సోకుతున్న వార్తలను చూస్తున్నాం.

తాజాగా కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప హోంక్వారంటైన్ కి వెళ్లారు. ఆయన అధికారిక నివాసంలో తాజాగా ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు

ఈ మేరకు అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నారు. తన విధులన్ని ఇంటి నుంచే నిర్వహిస్తానని, మీటింగ్స్ అన్ని వీడియో కాల్స్ ద్వారా చేపడతానని చెప్పారు. తన ఆరోగ్యం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.