Breaking News
Home / festival

festival

సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు పాఠశాలలకు దసరా సెలవులు. మొత్తం పదహారు రోజులు సెలవులిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ 9వరకు మాత్రమే సెలవులు. డిగ్రీ కళాశాలలకు మాత్రం ఈ నెల 28నుంచి సెలవులను ఇస్తున్నట్లు …

Read More »

మొహర్రం స్ఫూర్తిని కొనసాగిద్దాం…సీఎం కేసీఆర్..!

నేడు మొహర్రం పండుగ.. మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా మొహర్రం సంతాపదినాలు పాటిస్తారు. మొహర్రం పండుగ సందర్భంగా పీర్లను ఊరేగిస్తారు. బతుకమ్మ, బోనాల పండుగ లాగా…పీర్ల పండుగ కూడా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రోజు మొహర్రం పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు తన సందేశాన్ని ఇచ్చారు. ” నేడు మొహర్రం పండుగ. …

Read More »

రామాయణంలో మీకు తెలియని విచిత్ర గాథ ఇదే…!

వాల్మీక మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం ఈ లోకానికి సీతారామచంద్రుల ఆదర్శ ద్యాంపత్యాన్ని, కష్టసుఖాలను, లక్ష్మణుడి త్యాగాన్ని, హనుమంతుడి అజరామమైన భక్తిని చాటుతుంది. రామాయణ మహాకావ్యం మొత్తం ఏడు కాండాలు (భాగాలు) గా విభజింప బడింది. మొత్తము 24వేల శ్లోకాలు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఒక్కొక్క కాండములోని ఉప భాగాలను “సర్గ”లు. అంటారు. అయితే రామాయణంలోని అన్ని కాండాలలో కెల్లా యుద్ధకాండ మిక్కిలి ఆసక్తి కరంగా ఉంటుంది.. సీతాపహరణం, …

Read More »

గణేష్ నవరాత్రులలో ఏఏ వినాయక స్వరూపాలను పూజించాలి..ఏ ఏ స్తోత్రాలు పఠించాలి..!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి, పట్టణాలు, పల్లెల వరకు ఇండ్లలో, వీధుల్లో ముస్తాబైన మంటపాల్లో వివిధ రకాల ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులచే పూజలందుకుంటున్నారు. అయితే గణేష్ నవరాత్రులలో కొన్ని ప్రత్యేకమైన గణపతి స్వరూపాలను, కొన్ని స్తోత్రాలను పఠిస్తే…సకల శుభాలు, జ్థానం, అష్టైశ్వర్యాలను వినాయకుడు ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతోంది. గణేష్ నవరాత్రులలో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని.. …

Read More »

వినాయకుడు గజముఖంతో కూడా మనిషి ముఖంతో కనిపించే దేవాలయం ఎక్కడో ఉందో తెలుసా…?

దేవాయాలకు పుట్టినిల్లు మన వేద భూమి. హిందూ ధర్మం విలసిల్లుతున్న మన భరతదేశంలో అనేక మంది దేవతలను పూజిస్తారు. పురాణాలు, ఇతిహాసాలకు ఆనవాళ్లు మన కర్మభూమిలో ఇప్పటికీ కనిపిస్తాయి.శివాలయాలు, రామాలయాలు, శ్రీ కృష‌్ణ దేవాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, గణేష ఆలయాలు, అమ్మవార్ల ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయాలకు పెట్టినిల్లుగా దక్షిణ భారతదేశం విలసిల్లుతోంది. ఇక దేశమంతటా ఉన్న గణేష ఆలయాల కంటే తమిళనాడులోని ఓ వినాయక ఆలయం విభిన్నంగా …

Read More »

వినాయకుడిని నిమజ్జనం చేయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటీ…?

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి పల్లెల వరకు వీధివీధినా గణనాధులు పూజలందుకుంటున్నారు. గణేష్ మండపాలన్నీ భక్తులచే కిటకిటలాడుతున్నాయి. ఇక వినాయక చవితి రోజు తొలిపూజలు అందుకున్న వినాయకుడు…తొమ్మిది రోజుల పాటు భక్తులను దీవించనున్నాడు. అయితే మూడవ రోజు నుంచే గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. వినాయకులను 5 వ రోజు, 7 వ రోజు, 9 వ రోజు, 11 వ రోజు ఇలా బేసి …

Read More »

వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…!

వినాయకుడు అనగానే శుక్లాంబరథరం విష్ణుం..శశివర్ణం చతుర్భుజం అనే స్తోత్రం గుర్తుకు వస్తుంది.అలాగే వినాయకుడి అనగానే ఆయన బానపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్ర తొండం, నాలుగు చేతులు, ఆయన వాహనం మూషికం, చేటంత చెవులు గుర్తుకువస్తాయి. అసలు వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…శుక్లాంబరథరం స్తోత్రం వెనుక ఉన్న మార్మికత ఏంటో తెలుసుకుందాం. శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు సత్త్వగుణానికి ప్రతీక. ‘శుక్లాంబరధరం విష్ణుంః అంటే …

Read More »

వినాయకుడి ప్రతిమలను ఏ సమయంలో ఇంటికి తీసుకురావాలి..ఏ సమయంలో పూజించాలి…?

హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు …

Read More »

వినాయకచవితి నాడు పూజ ఇలా చేస్తే… విఘ్నేశ్వరుడు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు..?

సకల దేవతాగణముల అధిపతి… ఏ విఘ్నాలు కలుగకుండా ఈ చరాచర జగత్తును కాపాడే జగత్ రక్షకుడు.. విఘ్నేశ్వరుడు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడు జన్మించిన భాద్రపద శుక్ల చతుర్థినాడు వినాయకచవితి పర్వదినంగా జరుపుకుంటారు. సర్వదేవతాగణాధిపతిగా వినాయకుడిని ప్రకటించిన ఈ రోజునే గణనాథుడిని పూజించడం ఆనవాయితీ తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు. వినాయకుడు జ్ఞానానికి, సంపత్తుకి, అదృష్టానికి ప్రతీక. దక్షిణాయనం, శ్రావణమాసం, బహుళపక్షంలో వచ్చే తొలిపండుగవినాయకచవితి. హిందూ పండుగలు వినాయక చవితితో మొదలై ఉగాదితో ముగుస్తాయి. వినాయకుడిని …

Read More »

గజాననుడికి ఏనుగు రూపం వెనుక ఉన్న కారణం ఏమిటి?

సకల దేవతలకు గణాధిపతి…తొలిపూజలు అందుకునే ఆదిదేవుడు..విఘ్నేశ్వరుడు. అసలు వినాయకుడికి ముందు నుంచి ఏనుగు రూపం లేదు…అందరిలాగే మామూలు రూపంలోనే ఉండేవాడు.  పార్వతీదేవీ, పరమేశ్వరుల ముద్దుల తనయుడిగా, లంబోదరుడుగా గజాననుడిగా .భాసిల్లుతున్న వినాయకుడికి ఏనుగు రూపం ఎందుకు వచ్చింది. ? వినాయకుడి జన్మ వృత్తాంతాం ఏంటో తెలుసుకుందాం.   పురాణాల ప్రకారం కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ …

Read More »