Home / festival / రామాయణంలో మీకు తెలియని విచిత్ర గాథ ఇదే…!

రామాయణంలో మీకు తెలియని విచిత్ర గాథ ఇదే…!

వాల్మీక మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం ఈ లోకానికి సీతారామచంద్రుల ఆదర్శ ద్యాంపత్యాన్ని, కష్టసుఖాలను, లక్ష్మణుడి త్యాగాన్ని, హనుమంతుడి అజరామమైన భక్తిని చాటుతుంది. రామాయణ మహాకావ్యం మొత్తం ఏడు కాండాలు (భాగాలు) గా విభజింప బడింది. మొత్తము 24వేల శ్లోకాలు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు). ఒక్కొక్క కాండములోని ఉప భాగాలను “సర్గ”లు. అంటారు. అయితే రామాయణంలోని అన్ని కాండాలలో కెల్లా యుద్ధకాండ మిక్కిలి ఆసక్తి కరంగా ఉంటుంది.. సీతాపహరణం, వానరులతో లంకకు వారధి నిర్మించుట, రావణుడితో యుద్ధం, సీత అగ్ని ప్రవేశం, అయ్యోధ్యకు తిరిగి రాక, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే రామాయణంలో ఎవరికీ తెలియని విచిత్ర గాథ ఒకటి ఉంది. అదే స్వయంగా సీతాదేవి లక్ష్మణ స్వామిని మింగేసిన ఘటన. ఏంటీ వదిన అయిన సీతమ్మ , తన మరిది అయిన లక్ష్మణ స్వామిని మింగేయడం ఏంటీ..ఇది ఎక్కడా వినలేదు..విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా…యుద్ధకాండ ముగిసిన తర్వాత ఉత్తరకాండ ఆరంభంలో జరిగిన ఈ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రావణ సంహారం తర్వాత 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని తిరిగి సీతా, లక్ష్మణ సమేతంగా, హనుమతో కలిసి అయోధ్యకు వచ్చిన తర్వాత జరిగిన గాథ ఇది…అయితే వనవాసానికి వెళ్లేటప్పుడు తిరిగి అయ్యోధ్యకు క్షేమంగా చేరితే సరయూ నదికి పూజలు చేస్తానని సీతమ్మ ప్రమాణం చేస్తుంది. ఆ క్రమంలో అయ్యోధ్యకు తిరిగి క్షేమంగా వచ్చిన తర్వాత చేసిన ప్రమాణం మేరకు సరయూ నదికి వెళ్లాలనుకుంటుంది. అప్పటికే శ్రీ రామ పట్టాభిషేకం జరిగి..రాజ్యపాలనలో శ్రీ రాముడు తలమునకలై ఉంటాడు. దీంతో శ్రీ రాముడి రాజ్యపాలనకు భంగం కలుగకుండా సరయూ నదికి వెళుతున్నాను..తోడుగా రమ్మని తన మరిది అయిన లక్ష్మణుడిని సీతమ్మ కోరుతుంది. అప్పుడు హనుమంతుడు నేను కూడా తోడుగా వస్తానని చెప్పగా, సీతమ్మ వద్దు అని వారిస్తుంది. శ్రీ ప్రభువు దగ్గర ఉండి, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని హనుమకు చెప్పి లక్ష్మణుడితో కలిసి సరయూ నదీ పరివాహక ప్రాంతానికి బయలుదేరుతుంది. అయితే ఏదో కీడు శంకించిన హనుమంతుడు సీతా, లక్ష్మణ స్వామిని రహస్యంగా వెంబడిస్తూ వారికి అనుక్షణం కాపలాగా ఉంటాడు. సీతాదేవి, లక్ష్మణ స్వామి సరయూ నదీ ప్రాంతానికి చేరిన తర్వాత హనుమంతుడు వారిని ఓ చెట్టుపై నుంచి గమనిస్తుంటాడు.

ఇక పూజ నిమిత్తం కాలాష్ నది నుండి నీటిని తీసుకురావాల్సిందిగా సీతా దేవి లక్ష్మణుడిని ఆజ్ఞాపిస్తుది. దీంతో నీటి కోసం కాలాష్‌ నదికి వెళ్లి నీటిని తీసుకువస్తున్న లక్ష‌్మణుడిని శివుడి వర ప్రసాదం పొందిన అఘాసరుడు ఓ రాక్షసుడు నదిలోంచి వచ్చి,  హూంకరిస్తూ మింగేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సంఘటనను దూరం నుంచి చూసిన సీతాదేవి పరుగు పరుగున వచ్చి అఘాసరుడు మింగేయడానికి ముందే తన దైవిక శక్తులతో లక్ష‌్మణుడిని మింగేస్తుంది. ఆ సమయంలో హనుమంతుడు సైతం ఆశ్చర్యపోయేలా ఒక వెలుగులు విరజిమ్మే దైవిక వస్తువు రూపాన్ని సంతరించుకుని నిలబడుతుంది సీతాదేవి. అయితే అఘాసరుడు దైవిక వస్తువు రూపంలో నిలబడిన సీతాదేవిని కూడా మింగేయడానికి ప్రయత్నించగా హనుమంతుడు వెంటనే ఆ వస్తువును కాలాష్ నది నీటితో ఓ బంతిలా మార్చి సీతమ్మను, లక్ష్మణుడిని కాపాడుతాడు.

ఈ విషయాన్ని శ్రీ రాముడికి హనుమంతుడు వివరించి..బంతిలా మారిన సీతమ్మవారు, లక్ష్మణ స్వామి తిరిగి మానవరూపం దాల్చేలా వరం ఇవ్వమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ రాముడు సీతా లక్ష్మణులు కేవలం మనుష్యులు కాదని, మనుష్య రూపంలో ఉన్న దైవిక అవతారాలు అని హనుమంతుడికి వివరిస్తాడు. కాలాష్ నదీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను రక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముందు బంతిలా మార్చిన కాలాష్‌ నది నీటిని తిరిగి నదిలోకి పోయాలని శ్రీ రాముడు హనుమను ఆదేశిస్తాడు. శ్రీ రాముడి ఆదేశాల మేరకు హనుమంతుడు ఆ కాలాష్ నదిలోకి నీటిని తిరిగి కురిపించగా, ఆ దైవిక వస్తువు ఒక భారీ నిప్పు బంతి వలె మారి, ఆ మంటలలో అఘాసురుని అంతమొందించడం జరుగుతోంది. అఘాసరుడి పీడ వదిలి మరలా మళ్లీ ఈ నది సురక్షితమైన ప్రాంతంగా మారడంతో పాటు, సీతా దేవి, లక్ష్మణులు వారి వారి అసలు రూపాలను తిరిగి పొందారని రామాణయంలోని ఓ గాథ తెలుపుతోంది. చూశారుగా సీతాదేవి తన మరిది అయిన లక్ష్మణ స్వామిని మింగేయడం..హనుమంతుడు వారిని బంతిలా నది నీటితో బంతిలా మార్చేయడం. శ్రీ రాముడి అనుగ్రహంతో తిరిగి మానవ రూపంలోకి రావడం…చాలా ఆశ్చర్యంగా ఉంది కదా..ఇదండి..రామాయణంలో మనందరికీ తెలియని విచిత్రగాథ.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat