Home / festival / సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు

సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు పాఠశాలలకు దసరా సెలవులు. మొత్తం పదహారు రోజులు సెలవులిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది.

జూనియర్ కళాశాలలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ 9వరకు మాత్రమే సెలవులు. డిగ్రీ కళాశాలలకు మాత్రం ఈ నెల 28నుంచి సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించింది సర్కారు. డిగ్రీ కళాశాలలు ప్రారంభం మాత్రం ఆయా విశ్వవిద్యాలయాలను బట్టి ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.