Home / Tag Archives: CYCLONE

Tag Archives: CYCLONE

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు ఇబ్బందులు పడుతున్న అనేక రాష్ట్రాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈనేపధ‌్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 85 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాలకు హికా తుపాను వచ్చింది. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రానున్న 24గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశం ఉంది.పలుచోట్లు భారీ వర్షాలు పడనున్నాయి.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి రానున్న 24గంటల్లో వాయుగుండం గా మారే అవకాశం ఉంది.ఇది వెస్ట్ బెంగాల్,ఒడిస్సా తీరంలో కేంద్రీకృతమై ఉంది.గంటకు 45 నుంచి 50 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది,ఈ మేరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది.

Read More »

పశ్చిమబెంగాల్ సముద్ర తీర ప్రాంతాల్లో భారీవర్షం

ఒడిశాను బీభత్సం సృష్టించిన ఫణి తుపాన్ శనివారం మధ్యాహ్నం నాటికి పశ్చిమబెంగాల్ తీరాన్ని దాటనుంది. అర్దరాత్రి పన్నెండున్నర గంటలకు బెంగాల్ తీరాన్ని తాకిన తుపాన్ వల్ల ఖరగ్‌పూర్ నగరంలో గంటలకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుపాన్ పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్ నడియా మీదుగా బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది. ఫణి తుపాన్ క్రమేణా బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు వెళుతోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల …

Read More »

తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?

తుఫాన్ లకు పేర్లు ఎలా పెడతారో తెలుసా..?. అసలు అప్పటికప్పుడు వచ్చే తుఫాన్ లకు ఫలనా పేరు పెట్టాలని ఎవరు ..ఎక్కడ ఎందుకు చెప్పారో తెలుసుకుందామా..?.ఇప్పటివరకు మన దేశంలో మొత్తం ఐదు టాప్ తుఫాన్లు వచ్చాయి. వీటిలో మహాసేన్ (2013 మే,) ఫైలిన్ (2013 అక్టోబర్), హెలెన్ (2013 నవంబర్), లెహర్ (2013 నవంబర్), మాది (2013 డిసెంబర్) అని పేర్లు పెట్టారు. అసలు ఇలా ఎందుకు పెడతారంటే బంగాళాఖాతంలో …

Read More »

చిన్నపాటి గాలులకే అతలాకుతలం అవుతున్న అమరావతి.. తుఫాను వస్తే రాజధాని క్షేమమేనా.?

అమరావతిలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనానికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా నాసిరకం పనుల డొల్లతనం బయటపడుతూనే ఉంది. తాజాగా పెథాయ్‌ తుపాను వల్ల రెండురోజులుగా ఓ మోస్తరు వర్షం పడుతోంది. దీంతో మళ్లీ అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఛాంబర్‌లోకి సోమవారం పైకప్పు నుంచి వర్షం నీరు చేరింది. దీంతో ఛాంబర్‌లోని ఫైళ్లన్నింటినీ మరో గదిలోకి మార్చారు. ఈ ఏడాది మే నెలలోనూ, అంతకుముందు కూడా పలుమార్లు …

Read More »

ఏపీలో తుపాను అల్లక‌ల్లోలం చేస్తుంటే..చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా?

పెథాయ్‌ తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. విశాఖలో కూడా ఇవాళ ఉదయం నుంచి కుండపోత కురుస్తోంది.పెథాయ్‌ ధాటికి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్న అంచనాలు వెలువ‌డుతున్నాయి. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారో తెలుసా? రాజ‌స్థాన్‌లో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అత‌లాకుతలం అవుతున్న స‌మ‌యంలో బాబు ఇటీవ‌ల క‌లిసి బంధం అయిన కాంగ్రెస్ పార్టీ …

Read More »

పెథాయ్‌ కల్లోలం..భయంతో ప్రజలు

తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్‌’‌ ప్రస్తుతం కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది. ఇది గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.     తుపాన్‌ …

Read More »

తుఫానుగా మారిన తీవ్ర వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. పెథాయ్ గా నామకరణం చేసిన ఈ తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా పయనిస్తోంది. ఇది మచిలీపట్నానికి 900 కి.మీ, శ్రీహరికోటకు 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మారిన పెథాయ్.. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం …

Read More »

ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు

ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవ‌కాశం కనిపిస్తోంది. శ్రీహ‌రికోట నుంచి 1140 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వ‌ద్ద తీరం దాటే సూచ‌న‌లున్నాయి. స‌ముద్రం అల్లక‌ల్లోలంగా ఉండడంతో జాల‌ర్లు స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెల్లకూడ‌దని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే స‌మ‌యంలో …

Read More »