Home / Tag Archives: hyderabad

Tag Archives: hyderabad

27 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణపతి

వినాయక చవితి పండుగ అనగానే హైదరాబాదీలతో పాటు మిగతా ప్రాంతాల వారికి ఖైరతాబాద్‌ గణపతి గుర్తుకు వస్తాడు.  ప్రతి ఏడాది ఈ భారీ వినాయకుడిని  చూసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపుతుంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 27 అడుగుల ఎత్తులో  ఖైరతాబాద్‌ గణపతిని ప్రతిష్టించాలని గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. విగ్రహం ఎత్తు 27 అడుగులే కావడంతో పూర్తిగా  మట్టి వినాయకుడిని  ప్రతిష్టించాలని కమిటీ భావిస్తోంది. ఈసారి ధన్వంతరి …

Read More »

పీవీ రచనల ముద్రణ, స్మారకం కేంద్రం ఏర్పాటు : సీఎం కేసీఆర్

వీపీ నరసింహారావు రచించిన రచనలను వంద శాతం సాహిత్య అకాడమీ ద్వారా ముద్రిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పీవీ రచనలను విశ్వవిద్యాలయాలకు పంపనున్నట్లు వెల్లడించారు. పీవీ రచనలను పలు భాషల్లో ముద్రిస్తామని సీఎం చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పీవీ కాంస్య విగ్రహాలు ఐదు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వంగర, వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌, …

Read More »

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు

రాజధానిలో పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రులు కె. తారకరామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కూమార్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చేల్ జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, ఎండోమెంట్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఎ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు …

Read More »

కొవిఫర్ ఔషధం ధర ఎంతో తెలుసా…?

కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్‌’ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్‌ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటివిడుతగా 20వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్‌, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్‌, ఢిల్లీ, …

Read More »

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 269 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. తాజాగా మరో నలుగురు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 192కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఇప్పటి వరకు 3,071మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 2,412మంది చికిత్స పొందుతున్నారు. …

Read More »

పదిరోజుల్లో 50వేల మందికి కరోనా పరీక్షలు

కరోనా మహమ్మారిని రాష్ట్రంలో కట్టుదిట్టంగా కట్టడిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే వారం, పదిరోజుల్లో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాల్లోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50వేల మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయనున్నామని వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌లు, ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అనుమతినిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు …

Read More »

హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం

హైదరాబాద్ నగరంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు వణికిపోతున్నారు. ఆదివారం నగరంలో మొత్తం 132 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఆరుగురు మృతి చెందారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వారిలో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, నిమ్స్‌ తదితర వైద్యశాలలకు చెందిన వైద్యులు కూడా ఉన్నారు. అంతేకాకుండా తొమ్మిది మంది పోలీసులు, 108 ఉద్యోగి, కొరియర్‌బాయ్‌, ఆటోడ్రైవర్‌ ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు. వీరిని చికిత్స …

Read More »

కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి

కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్‌ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్‌ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్‌ మనోజ్‌కుమార్‌ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్‌ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్‌ క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …

Read More »

పాముల పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంత‌రం ఆయన …

Read More »

వయస్సు 70.. నలుగురు భార్యలు.. యువతిపై దారుణం!

ఓ వైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి.! ఓ అమ్మాయికి ఆర్థికసాయం చేస్తానంటూ నమ్మించి.. ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. అసలేం జరిగింది..? ఎవరీ వృద్ధ కామాంధుడు అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అసలేం జరిగింది!? బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో …

Read More »