నేను నిప్పు అంటూ పదే పదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలియాస్ నిప్పు నాయుడి అవినీతి తుప్పు బాగోతం ఐటీ షోకాజ్ నోటీసులతో బట్టబయలైంది. అసలు విజనరీ అని చంద్రబాబును ఎందుకంటారో తెలుసా..హైటెక్ సిటీ, సైబరాబాద్ కట్టించానని గొప్పలు చెప్పుకోవడంలో కాదు..తన చేతికి మట్టి అంటకుండా..తెలివిగా వేల కోట్లు నొక్కేయడంలో నిప్పు నాయుడి గారిని విజనరీ అని పిలవచ్చు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అమరావతిలో కట్టిన తాత్కాలిక కట్టడాలన్నీ షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకే కట్టబెట్టిన చంద్రబాబు..వాటికి కాంట్రాక్టులు ఇచ్చినందుకు అడ్డదారిలో బోగస్ కాంట్రాక్ట్‌ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి, వారి నుంచి కమీషన్ల రూపంలో తన ఖాతాలో జమ చేసుకున్నారు.
తాజాగా ఐటీ దాడుల్లో మన నిప్పు నాయుడి గారి 118 కోట్ల అవినీతి బాగోతం బట్టబయలైంది. ఈ క్రమంలోనే ఐటీ శాఖ 118 కోట్ల బ్లాక్ మనీపై బాబుగారికి నోటీసులు జారీ చేసిందని హిందూస్థాన్ టైమ్స్ కథనం ఇప్పుడు నేషనల్ వైడ్ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, పేరి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందూస్తాన్ టైమ్స్ చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసింది. హిందుస్తాన్ టైమ్స్ కథనంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.. అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా? కాదా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు గుట్టంతా ఐటీ బయటపెట్టింది. ప్రజల ఆస్తిని చంద్రబాబు ఎలా కొట్టేస్తాడనేది బహిర్గతమైంది. 2016 నుంచీ చంద్రబాబు బాగోతం ఇప్పుడు బయటకొచ్చింది. ఇన్‌ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌లతో 118 కోట్లు ముడుపులు తీసుకున్నారు. తన పీఏ శ్రీనివాస్ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరిగింది. ఈ ముడుపుల బాగోతంపై ఐటీ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబుకు మనోజ్ పార్థసాని ముడుపులు ఇచ్చినట్టు తేలింది. ఈ ముడుపులను దాచి ఉంచిన ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదని పేర్నినాని ప్రశ్నించారు.
ఇక ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లోమీడియా చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించు.. ప్రధానులు, రాష్ట్రపతులను మార్చిన చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే రాయాలిగా?. హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం వీరెవ్వరికీ కనిపించదని దని పచ్చ ఛానళ్లను తనదైన స్టైల్లో చితక్కొట్టేశారు. ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబును వెంటాడుతోందని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐటీ నోటీసులపై నోరు విప్పాలని పేర్నినాని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీతపై నోరుపారేసుకున్న నారా లోకేశ్‌కు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి అంటూ పేర్నినాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. . లోకేశ్ ముందు నీ పాదయాత్ర ఆపి నీ తండ్రి అవినీతి బాగోతంపై స్పందించు…పోసానిపై పరువు నష్టం దావా వేసావు..మరి ఇప్పుడు హిందుస్తాన్ టైమ్స్‌పై దావా వేసే దమ్ముందా? అని లోకేష్ కు పేర్నినాని సవాల్ విసిరారు..
గతంలో 18 కేసులలో స్టే తెచ్చుకున్న స్టేబీఎన్..ఇప్పుడు ఐటీ నోటీసులపై కూడా స్టే తెచ్చుకుంటాడని పేర్నినాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ప్రజల సొమ్మును అడ్డంగా తినేశారని మండిపడ్డారు.. మళ్లీ ప్రజల సొమ్మును తినేసేందుకు అధికారం ఇవ్వాలా?. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబే అని ఫైర్ అయ్యారు. అసలు తన ఫ్యూచర్ కే ష్యూరిటీ లేని చందరబాబు మళ్లీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కొత్త మోసం మొదలుపెట్టాడు… తప్పుడు సంతకంతో మళ్లీ ప్రజల వద్దకు బయలుదేరాడని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎంతకైనా దిగజారడంలో, ఎవరినైనా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబు దిట్ట. అవసరం తీరే వరకు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడంటూ పేర్నినాని సెటైరికల్ పంచ్ వేశారు.. మొత్తంగా చంద్రబాబు అలియాస్ నిప్పు నాయుడు 118 కోట్ల అవినీతి తుప్పు బాగోతం ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.