ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుంగిపోయిన మహేష్ బాబు కుటుంబం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు ఘట్టమనేని వరప్రసాద్ – అపర్ణ దంపతుల కూతురు డాక్టర్ దామిని పెళ్లిపీటలెక్కింది. డాక్టర్ సునీల్ కోనేరు – రాధికల పెద్ద కుమారుడు డా. సేతు సందీప్ తో దామిని వైవాహిక జీవితాన్ని ఆరంభించనుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి ప్రీవెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రిన్స్ మహేష్ బాబు దంపతులు విచ్చేసి..కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. సంగీత దర్శకుడు కీరవాణితో సహా పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రజెంట్ ఏపీ పర్యాటక, యువజన క్రీడా శాఖల మంత్రి రోజాతో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్రమంలో రోజా, మహేష్ బాబు కాసేపు సరదాగా ముచ్చటించి, సెల్ఫీలు తీసుకున్నారు.ఈ ఫోటోలను మంత్రి రోజా తన ఇన్‌స్టాగ్రామ్ లో తన అభిమానులతో పంచుకోగా…క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారాయి. ప్రజెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై టాలీవుడ్ లో బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ వెంటనే రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న హాలీవుడ్ రేంజ్ మూవీలో మహేష్ హీరోగా నటిస్తుండడం ప్రిన్స్ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తుతోంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ వర్క్ శరవేగంగా చేస్తున్న రాజమౌళి త్వరలో సూపర్ స్టార్ తో కలిసి సెట్స్ మీదకు వెళ్లనున్నాడు. ఇక మంత్రి రోజా నగరి నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ప్రజా క్షేత్రంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.