Home / ANDHRAPRADESH / హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!

హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే..గత 10 రోజులుగా చంద్రబాబును బెయిల్‌పైకి తీసుకువచ్చేందుకు లోకేష్ ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఖరీదైన లాయర్ల పప్పులు సీఐడీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ముందు ఉడకడం లేదు.. ఇక లాభం లేదనుకుని..హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు..ఇవాళ చంద్రబాబు లాయర్ల క్వాష్ పిటీషన్లతో పాటు, సీఐడీ వేసిన కస్టడీ పిటీషన్లపై కూడా విచారణ జరగనుంది..అయితే మా చంద్రబాబు నాయుడు లాంటి నిప్పు నాయుడినే అరెస్ట్ చేస్తారా..అన్యాయం..అక్రమం..ఇదంతా జగన్ కుట్ర అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా గగ్గోలు పెడుతోంది.ఇక చంద్రబాబు ఎంత కాలం జైల్లో ఉంటే ప్రజల్లో అంత సింపతీ వస్తుందని..టీడీపీ నేతలు, పచ్చ మీడియా లెక్కలేసుకుంటోంది..

అయితే చంద్రబాబు అరెస్ట్‌పై సామాన్య ప్రజలు ఎవరూ స్పందించకపోవడంతో టీడీపీ ఖంగు తింది..అసలు ప్రజలే ఎందుకు..టీడీపీ నేతలే స్పందించకుండా ఇంట్లో కూర్చుని బిర్యానీలు తింటూ…చంద్రబాబు అరెస్ట్ అయిన విజువల్స్‌ను టీవీల్లో వినోదంలా చూస్తున్నాయని…సాక్షాత్తు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన చెందిన ఓ ఆడియో వైరల్ అయింది..చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ప్రజల్లో ముఖ్యంగా కమ్మ సామాజికవర్గం, ఇతర సానుభూతి వర్గాల్లో భావోద్వేగం రగిలించేందుకు లోకేష్..టీం ఎల్లోమీడియాతో కలిసి పథకం వేసింది..అందులో భాగమే..కమ్మ కులగణం ఎక్కువగా ఉన్న కృష్ణా, గంటూరు జిల్లాల్లో పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారు..కుల పిచ్చితో కొట్టుకునే ఈ రెండు జిల్లాల్లో చంద్రబాబు కోసం ఆడవాళ్లు సైతం రోడ్డు ఎక్కడం గమనార్హం..‎

ఇక తెలంగాణలో కూడా తమ కుల గణం ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి ఏరియాలో టీడీపీ నేతలు తమ కులపోళ్లను రంగంలోకి దింపారు..బాబుకు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఇక్కడ కూడా పెయిడ్ ఆందోళనలు జరుగుతున్నాయి..ఇక ఐటీ అంటే చంద్రబాబు అని కొట్టుకుచచ్చే కమ్మ ఐటీ ఉద్యోగులు..హైటెక్ సిటీ దగ్గర చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం..మా విజనరీ బాబుగారినే చిప్పకూడు తినిపిస్తారా అంటూ బట్టలు చించుకునేంత పని చేశారు..దీంతో తెలంగాణ పోలీసులు కమ్మ ఐటీ ఉద్యోగుల బెండు తీసే పనిలో పడ్డారు..అయితే తెలంగాణలో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు..చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా…టీడీపీ కమ్మ ఐటీ బ్యాచ్ చేస్తున్న రచ్చకు కౌంటర్‌గా జగన్ అభిమానులు రంగంలోకి దిగారు.. స్కిల్ స్కామ్‌లో స్కామ్‌స్టర్ చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్టే అంటూ జగన్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఐటీ ఉద్యోగులు భారీ సంఖ్యలో కీసర ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కార్లలో ర్యాలీ చేపట్టారు. తమ కార్ల ర్యాలీ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి గచ్చిబౌలి వరకు సాగుతుందని ఐటీ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్‌.. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అవినీతి చేయకపోతే అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. అచ్చెన్నాయుడు.. ప్లీజ్‌.. ప్లీజ్‌ అని బ్రతిమాలుకుంటే, దండం పెడతాను అంటే నిన్న ఓఆర్‌ఆర్‌పై పెయిడ్‌ ఆర్టిస్టులు ర్యాలీ చేపట్టారని ఎద్దేవా చేశారు.

అసలు హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ కట్టింది.. తెచ్చిందే వైఎస్సార్‌. ఇక్కడ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ కుండ బద్ధలు కొట్టారు. హైటెక్‌ సిటీ కమాన్‌ ఒక్కటే చంద్రబాబు కట్టారు. పక్కన ఫైనాన్‌షియల్‌ డిస్ట్రిక్‌, గచ్చిబౌలి వచ్చింది వైఎస్సార్‌, కేసీఆర్‌ హయాంలోనే. వైఎస్సార్‌ ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు వచ్చాయి. చంద్రబాబు చేసిందేమీలేదు. స్కామ్‌ ప్రూవ్‌ అయ్యింది కాబట్టే.. కోర్టు రిమాండ్‌ ఇచ్చింది కాబట్టే.. చంద్రబాబు జైలుకు వెళ్లారు. ఎంత మంది వచ్చినా.. ఎన్ని మాటలు మాట్లాడినా.. సీఎం జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు ఇది ఫిక్స్‌ అంటూ జగన్ ఫ్యాన్స్ టీడీపీ కమ్మ ఐటీ ఉద్యోగులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో చిప్పకూడు తింటుంటే..తెలంగాణలో కమ్మ కులపోళ్ల గోల ఏంటీ అని తెలంగాణ ప్రజలు టీడీపీ బ్యాచ్ ఓవరాక్షన్‌ని చీదరించుకుంటున్నారనే చెప్పాలి.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat