Home / ANDHRAPRADESH / చంద్రబాబు జైలుకు వెళ్లాడని రోడ్లపైకి వచ్చేది మా కమ్మ కులపోళ్లే..!

చంద్రబాబు జైలుకు వెళ్లాడని రోడ్లపైకి వచ్చేది మా కమ్మ కులపోళ్లే..!

ప్రపంచం బాధ..నా బాధ అని మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు..కానీ ఇప్పుడు చంద్రబాబు బాధ…మా కమ్మోళ్ల బాధ మాత్రమే అని కమ్మ కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ అంటున్నారు. 45 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..బినామీల పేరుతోనే..మరొక విధంగానో.. తన చేతికి మట్టి అంటకుండా తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..ఎట్టకేలకు రూ.371 కోట్ల స్కిల్ స్కామ్‌లో రెండేళ్లుగా పైగా దర్యాప్తు చేసిన ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది…ఇన్నాళ్లు ఏ వ్యవస్థలను అయితే మేనేజ్ చేసాడు..ఇప్పుడు అదే వ్యవస్థలో అరెస్ట్ కాకుండా…చంద్రబాబు నానా అవస్థలు పడ్డాడు…అఖరికి హౌస్ అరెస్ట్ కోసం ప్రయత్నించాడు…కానీ ఇప్పుడు చంద్రబాబును కాపాడే వ్యవస్థల్లో మార్పులు చేర్పులు జరిగాయి…గతంలో లాగే ఏ కేసులో విచారణకు హాజరు కాకుండా…అరెస్ట్ కాకుండా ముందస్తుగా స్టేలు ఇచ్చే వ్యవస్థ మారిపోయింది…అందుకే చంద్రబాబు ఇప్పుడు జైలు నుంచి బయటపడేందుకు బెయిల్ కోసం నానా తిప్పలు పడుతున్నాడు..అయితే ఇన్నాళ్లు మా చంద్రబాబు నిప్పు..దమ్ముంటే ఎన్ని కేసులైన పెట్టుకో…అంటే జగన్‌ని రెచ్చగొట్టిన కమ్మ మీడియా ఇప్పుడు తమ కులదైవం చంద్రబాబు నాయుడు..రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్నాడని..దిసీజ్ వెరీ దారుణం…మా నిప్పు నాయుడినే జైల్లో పెడతారా..ఇదంతా జగన్ కక్ష సాధింపు అంటూ గగ్గోలు పెడుతోంది..అవినీతి కేసులో అరెస్టైన నిప్పునాయుడు కాస్తా తుప్పునాయుడిగా మిగిలిపోయాడు..దీంతో పచ్చమీడియాకు పిచ్చెక్కిపోయింది..ముఖ్యంగా మా బ్లడ్డు వేరు..బ్రీడ్ వేరు అంటూ..బాలయ్య లాంటి కొందరు కమ్మోళ్ల అతి వల్ల మిగిలిన కులాలు కమ్మోళ్లకు దూరం జరిగాయి…

అసలు గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఏకంగా 152 సీట్లు గెలిచాడంటే ..చంద్రబాబు అసమర్థ పాలనకు తోడుగా..కమ్మకులంపై మిగిలిన కులాలకు ఉన్న ద్వేషం కూడా ఓ కారణమనే చెప్పాలి…ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో కమ్మోళ్లు అంతా కన్నీరు మున్నీరు అయిపోయారు…అయ్యో కొడుకు పప్పు అయినా మా చంద్రబాబు నాయుడి నిప్పులా బతికాడే…ఆయనకే ఎంత కష్టం వచ్చిందో అంటూ గావుకేకలు పెడుతూ కమ్మోళ్లంతా రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేస్తున్నారు..కమ్మ కులగణం ఎక్కువగా ఉన్న ఉమ్మడి క్రిష్ణా, గుంటూరు జిల్లాలో అయితే అమరావతి ఉద్యమం తర్వాత ఇండ్లకే పరిమితమైన కమ్మ జాతి మహిళామణులు కూడా రోడ్ల మీదకు వచ్చి..మా భువనేశ్వరమ్మకు మద్దతుగా మేమున్నామంటూ నానా గోల చేశారు..ఇక చంద్రబాబు ప్రపంచం బాధగా గుర్తించడం లేదని, కనీసం రోడ్ల మీదకు మా కమ్మోళ్లు తప్పా..ఎవరూ రావడం లేదని రగిలిపోయిన కొందరు కమ్మ ప్రముఖులు..పెయిడ ఉద్యమాలు స్టార్ట్ చేశారు..తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని కమ్మోళ్లు అధికంగా ఉండే కూకట్‌పల్లి, హైటెక్ సిటీ వంటి చోట్ల కమ్మ ఐటీ కుర్రోళ్లు ..కొందరు కమ్మ లేడీస్ బాబు అరెస్ట్ అన్యాయం.,అక్రమం అంటూ…కాసేపు రోడ్లపై షో చేస్తే హైదరాబాద్ పోలీసులు బెండు తీశారు..ఇక కమ్మ కులపోళ్లు అధికంగా ఉండే…అమెరికా, లండన్ వంటి చోట్ల కూడా బాబు అరెస్టుకు వ్యతిరేకంగా కమ్మోళ్లు చేస్తున్న అతి చూసి వీళ్లకు కులపిచ్చి పోదు…వీళ్లసలు మారర్రా అంటూ మిగిలిన కులాల ప్రజలు చీదరించుకునే స్థాయికి దిగజారిపోయారు..

తాజాగా ఇదే విషయమై కమ్మ కుల దైవంగా భావించే చంద్రబాబుకే కళ్లు బైర్లు కమ్మేలా..అదే కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కేవలం కమ్మ కులానికి చెందిన వారే సపోర్టు ఇస్తున్నారని అన్నారు. అలాగే బాబుకు భజన చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్‌ కమ్మ కులానికి చెందినవారివే. అందుకే వీరంతా చంద్రబాబు ఏం చేసినా మద్దతిస్తూ డప్పులు వాయిస్తారని ఎద్దేవా చేశారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడుసుమిల్లి మాట్లాడుతూ..చంద్రబాబు లాంటి అవినీతిపరుడిని వెనకేసుకువస్తున్న కమ్మోళ్ల తీరును తప్పుబట్టారు. నేను కమ్మ కులస్థుడినే. మా కులం వారు మిగతా కులాల నుంచి దూరమై ఒంటరి అయిపోయారంటూ వ్యాఖ్యానించార.. చంద్రబాబు అరెస్ట్‌లో​ ఆయనకు మద్దతు ఇస్తున్న వారు కేవలం మా కులానికి చెందినవారే అంటూ కమ్మోళ్ల కళ్లు బైర్లు కమ్మెలా కామెంట్స్ చేశారు. చంద్రబాబు పెద్ద అవినీతిపరుడు. ఇప్పటిదాకా అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ వచ్చాడని ఆయన అన్నారు. అసలు చంద్రబాబు ఐటీని తెచ్చాడు అనేది కేవలం మా కమ్మోళ్ల ప్రచారం మాత్రమే… ఐటీకి బాబు చేసిందేమీ లేదు అంటూ చంద్రబాబును ఐటీ బ్రాండ్ అంబాసిడర్‌ అని బిల్డప్పులు ఇచ్చే కమ్మోళ్ల బట్టలూడదీసి కొట్టారు.. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసి తీసుకువస్తుంటే పట్టించుకున్న వ్యక్తి ఒక్కరు కూడా లేరని…కమ్మోళ్లు కూడా అచ్చెంనాయుడు బాబుగారు అరెస్ట్ అయితే రోడ్ల మీదకు ఎవరూ రాలేదని వాపోతే..కమ్మోళ్లంతా రోడ్ల పైకి వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నారని అడుసుమిల్లి అన్నారు…

ఇక అమరావతి ఉద్యమం లేదు.. ఏమీ లేదు. కేవలం మూడు, నాలుగు ఊర్లలోనే ఉంది అంటూ అమరావతి అనేది కేవలం కమ్మోళ్ల కోసం చంద్రబాబు కట్టిన కమ్మరావతి అని అడుసుమిల్లి చెప్పకనే చెప్పారు…కేవలం తమ కమ్మకుల పెద్దలకు దోచిపెట్టడానికి అమరావతిలో పచ్చని భూములను చంద్రబాబు నాశానం చేశాడని అడుసుమిల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పప్పు నాయుడు అలియాస్ నారా లోకేశ్‌ యాత్ర అంతా డబ్బులతోనే నడిచిందని …అది పాదయాత్ర కాదని కమ్మోళ్లు స్పాన్సర్ చేస్తున్న పెయిడ్ యాత్ర అని అడుసుమిల్లి ఫైర్ అయ్యారు.. టీడీపీకి మద్దుతు ఇచ్చే స్థితిలో ప్రజలెవ్వరూ లేరు. వైఎస్సార్‌సీపీని ఏ పార్టీ ఏమీ చేయలేదని అడుసుమిల్లి స్పష్టం చేశారు. ఇక ఏపీల టీడీపీ, జనసేన పొత్తులపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.. ఏపీలో టీడీపీ, జనసేన కలిసినా వైఎ‍స్సార్‌సీపీకి ఫుల్‌ మెజార్టీ వస్తుందని నా దగ్గరున్న సర్వేలు చెబుతున్నాయి. మా కులం వాళ్లు తప్పిస్తే మిగతా కులాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి మద్దతు ఉంది. సీఎం జగన్‌ మాట మీద నిలబడతారు. నిజాయితీ రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో వాలంటీర్‌ వ్యవస్థ చాలా బాగుంది. సీఎం జగన్‌ అందిస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటూ కమ్మ కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి..చంద్రబాబు కోసం మేం రోడ్డపైకి వచ్చి పిచ్చోళ్లలా బట్టలు చించుకుంటుంటే..మన కమ్మకులపోడు అయి..ఇలా జగన్ కు మద్దతుగా మాట్లాడుతారా అంటూ అడుసుమిల్లిపై కమ్మోళ్లు అంతా కారాలు మిరియాలు నూరుతున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat