Home / Tag Archives: slider (page 140)

Tag Archives: slider

తెరపైకి గోదావరి-కావేరి అనుసంధానం

దేశంలో ప్రధాన నదులైన  గోదావరి- కావేరి అనుసంధాన ప్రాజెక్టును కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ప్రతిపాదనలు తీసుకొచ్చింది. మొత్తం మూడు ప్రతిపాదనలను తెలంగాణ ముందుంచింది. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన ప్రతిపాదనలతోపాటు తెలంగాణ సూచించిన మార్పులకు అనుగుణంగా తయారుచేసిన తాజా ప్రతిపాదనలనూ ప్రస్తావించింది. జానంపేట నుంచి దుమ్ముగూడెం.. మణుగూరు బొగ్గు గనులను అనుసరిస్తూ.. హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ మీదుగా …

Read More »

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీతోనే మేలు

తెలంగాణలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఉచితంగా వైద్యసేవలు అందించాలన్న ఆశయంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో వినూత్న వైద్య కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి తెలంగాణలో అమలుచేస్తున్న పలు వైద్యసేవాపథకాల ద్వారా ఏటా 85.04 లక్షల కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఉచిత వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆయా పథకాల ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. ఈ పథకాల్లో ప్రతిష్ఠాత్మకమైన ఆరోగ్యశ్రీ ద్వారా 77.19 లక్షల …

Read More »

హరితాగారంగా వరంగల్ కేంద్రకారాగారం

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ చైతన్యం కలిగిన జిల్లాలో ఒకటి వరంగల్ ..ఈ క్రమంలో ఓరుగల్లు కేంద్రకారాగారం హరితాగారంగా రూపుదాల్చింది. దేశంలోనే అతిపెద్ద జైలు నర్సరీ నిర్వహణ కేంద్రంగా వరంగల్ కేంద్ర కారాగారం ఇప్పు డు సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నది. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో 14 లక్షల మొక్కల పంపిణీ కేం ద్రంగా ఈ నర్సరీ రూపుదిద్దుకున్నది. 50 రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో జైలు ఆవరణ …

Read More »

సీఎం కేసీఆర్ కటౌట్లకు జలాభిషేకం

తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాకే అందుతుందని అప్పట్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పిన మాట క్షేత్రస్థాయిలో వాస్తవరూపం దాల్చింది. కాళేశ్వరం నుంచి మొట్టమొదటిసారిగా జిల్లాలోని కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామంలోని కొచ్చెరువుకు నీళ్లు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఆ జలాలతో నిండుతున్న మొట్టమొదటి చెరువు ఇదే. దశాబ్దంన్నరగా చుక్కనీటికి నోచుకోని ఈ చెరువులోకి కాళేశ్వ రం జలాలు …

Read More »

పోలవరం పనులు ఆపమనలేదు

నవ్యాంధ్రలో పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్ కు వైసీపీ సర్కారు పిలుపునిచ్చిన సంగతి విదితమే. అయితే వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్ పై మాత్రమే రివర్స్ టెండరింగ్ కెళ్ళోద్దని తీర్పునిచ్చింది కానీ పోలవరం పనులు ఆపేయమని కాదు అని ప్రభుత్వ లాయర్లు మీడియాతో …

Read More »

పహిల్వాన్‌ ట్రైలర్ వచ్చేసింది..!

తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన క‌న్న‌డ న‌టుడు సుదీప్. ప్ర‌స్తుతం ఈ న‌టుడు ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప‌లు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క …

Read More »

ట్రూ కాలర్ వాడుతున్నారా..!

ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో  ప్రతి మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్‌ఫోన్‌లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు …

Read More »

ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ భవనం 84 లక్షలతో నిర్మితమయింది. నూతన భవనాన్ని ప్రారంభించడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్, పోలీసు బృందం పాల్గొన్నారు.

Read More »

రాజధాని మార్పుపై మంత్రి గౌతమ్ రెడ్డి క్లారీటీ..!

నవ్యాంధ్ర రాజధానిని అమరావతి నుండి వైసీపీ సర్కారు తరలిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన నేతలు విషప్రచారం చేస్తోన్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాజధాని మార్పుపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి క్లారీటీచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని  క్లారిటీ ఇచ్చారు. రాజధాని తరలిస్తున్నట్లు బొత్స చెప్పలేదన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ చెప్పిందే …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేపై తిరగబడిన వరద బాధితులు

నవ్యాంధ్రలో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు చుక్కెదురైంది. ఈ రోజు గురువారం పెనుమూడిపల్లెపాలెంలో వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టిన ఆయన ప్రజల చేతిలో అభాసుపాలయ్యారు. అక్కడ వరద సహాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ జనాన్ని రెచ్చగొట్టారు. దీంతో ఆయనపై తిరగబడ్డ జనం అసలు మీరేం చేశారో చెప్పాలంటూ నిలదీశారు. గత ఐదేళ్లలో ఒక్కసారైనా మా ఊరు వచ్చారా అంటూ ప్రశ్నించారు. వరదలు వస్తే ప్రభుత్వం …

Read More »