తెలుగు రాష్టాల్లో ఈ మద్య తరచుగా వినిపిస్తున్న పేరు కత్తి మహేష్ . సిని విమర్శకుడు సినిమా విశ్లేషకుడు అని ఆయన్ని అయన సర్టిఫై చేసుకుంటుంటాడు. ఇటీవల విడుదలైన అన్ని సినిమా లని విమర్శిస్తూ.. హీరో లని విమర్శిస్తూ వారి అభిమానుల ఆగ్రహానికి లోను అవుతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండు సామాజిక వర్గాలు అయిన కమ్మ, కాపు కులాల పేర్లను ప్రధానంగా ప్రస్తావిస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సినీ వర్గీయుల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కమ్మ హీరోల సినిమాల్ని కాపు హీరో ఫ్యాన్స్ చెడ్డ చెయ్యడం. కాపు హీరోల సినిమాల్ని కమ్మ హీరో ఫ్యాన్స్ బ్యాడ్ పబిసిటీ చెయ్యడం. కమ్మ హీరోల ఫ్యాన్స్ లొనే ఒక ఫ్యామిలీకి మరో ఫ్యామిలీ హీరో ఫ్యాన్స్ కి పడకపోవడం. ఒకే ఫ్యామిలీ లొనే వివిధ కుటుంబ, రాజకీయ కారణాల వల్ల ఒకరినొకరు తక్కువ చేసుకునేలా క్యాంపెయిన్లు చెయ్యడం. ఒక్కొక్కరి చేతిలో కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ చానళ్లు, కొన్ని టివి ఛానళ్లు. మీలో మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ సినిమాలను సినిమా పరిశ్రమను గబ్బు పట్టిస్తూ రివ్యూల మీద పడి ఏడుస్తారేందుకు..అంటూ తన ఫేస్ బుక్‌లో కత్తి మహేష్ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే రివ్యూల గొడవ తారా స్థాయికి చేరగా.. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమరాన్నే రేపుతున్నాయి.