బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోలను పీవీ సింధు తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కేబీసీ నిర్వాహకులు బిగ్‌బి-పీవీ సింధుపై ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అయితే ఇది టీవీలో ఎప్పుడు ప్రసారంకానుందో తెలియాల్సి ఉంది. ‘ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధును కలవడం ఎంతో గర్వంగా ఉందని’ అమితాబ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఈ మధ్య కాలంలో భారత క్రీడాకారులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రపంచకప్ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, జులన్ గోస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా వీరు గెలిచిన మొత్తాన్ని హైదరాబాద్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రొకబడ్డీలోని జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సింధు రెండో స్థానంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
