కన్నడ యువ నటుడు, ‘పప్పుసీ కామెడీ’ ఫేం రాకేశ్(27) మంగళవారం మృతి చెందారు. కన్నడ సినిమా పరిశ్రమలో ‘బుల్లీ’గా సుపరిచితుడైన ఆయన కోరమంగలలో ఉన్న సెయింట్‌జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గ్యాంగ్రిన్ వ్యాధితో బాధపడుతున్న రాకేశ్ రెండు నెలలక్రితం శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. మరోసారి వ్యాధి తిరగబెట్టడంతో ఆయన సెయింట్‌జాన్స్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు.