బాలయ్య ఏ ముహార్తాన నిర్మాత బెల్లంకొండపై కాల్పులు జరిపి, అరెస్ట్ అయి ఆ తర్వాత బావ చంద్రబాబును అడ్డం పెట్టుకుని మెంటల్ హాస్పిటల్ నుంచి మెంటల్ సర్టిఫికెట్ తెప్పించుకుని ఆ కేసు నుంచి బయపడ్డాడో అప్పటి నుంచి కాస్త విచిత్రంగా, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు.. అసలే బాలయ్యకు చేతివాటం ఎక్కువ..పుర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు అని వీరభద్ర సిన్మాలోని డైలాగ్‌కు తగట్టుగానే బాలయ్య పుర చేయి , కుడి చేయి అని తేడా లేకుండా రెండు చేతులతో లాగి ఎదుటోళ్ల చెంపలు పగులగొడుతున్నాడు, వీపులు వాయగొడుతున్నాడు.ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు కార్యకర్తలు, సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వెర్రి అభిమానులు బాలయ్య చేతివాటానికి బలవుతున్నారు. అయితే సిన్మా షూటింగ్‌లలో కూడా అసిస్టెంట్లను చావబాదుతున్నాడని టాక్. దీంతో బాలయ్య కింద అసిస్టెంట్లుగా పని చేయడానికి ఎవరూ ముందు రావడం లేదంటూ ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం రాసింది. ఇటీవల కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో, నిర్మాత సి. కల్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో షాట్ బ్రేక్‌లో తన బూటు లేస్ కట్టమంటూ బాలయ్య తన అసిస్టెంట్‌ను లాగి కొట్టాడు. షూటింగ్‌లో ఇలా అసిస్టెంట్‌ను కొట్టడం వివాదాస్పదంగా మారింది. అయినా బాలయ్య తీరు మార్చుకోవడం లేదు..అసలే బాలయ్య మూడ్ క్షణక్షణానికి చిత్రంగా మారుతూ ఉంటుంది..ఎప్పుడు ఏం చేస్తే బాలయ్య చేతిలో తన్నులు తినాల్సి వస్తుందో అని బాలయ్య దగ్గర అసిస్టెంట్లుగా పని చేయమని ప్రొడక్షన్ మేనేజర్లకు తేల్చిచెబుతున్నారంట..పాపం ప్రొడక్షన్ మేనేజర్లకు నరకం కనపడుతోంది..అసిస్టెంట్లు లేకపోతే తమను ఎక్కడ కొడతాడో అని వాళ్ల భయం వాళ్లది..దీంతో రోజుకు ఇచ్చే వేతనం కంటే డబుల్ ఇస్తామని ఆశ చూపినా బాలయ్య దగ్గర పని చేయడానికి అసిస్టెంట్లు ససేమిరా అంటున్నారట..దీంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక నిర్మాత సి. కల్యాణ్ తలపట్టుకున్నాడు. అయితే పైకి మాత్రం బాలయ్య బాగా సహకరిస్తున్నాడని చెబుతున్నా..లోలోపల మాత్రం బాలయ్యతో అనవసరంగా సిన్మా పెట్టుకున్నాని ఫీల్ అవుతున్నాడంట..మరో విషయం ఏమిటంటే..ఇటీవల ఖర్చు భారీగా అవుతుంది. ..షెడ్యూల్‌లో ఒక రోజు తగ్గించమని అడిగి బాలయ్యతో బూతులు తిట్టించుకున్న నిర్మాత సి. కల్యాణే అని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. మొత్తానికి బాలయ్య అంటే బాబోయ్ మేము పని చేయమని ప్రొడక్షన్ అసిస్టెంట్లు పారిపోతుంటే నిర్మాతలు తలపట్టుకుంటున్నారంట.. పైసా వసూల్ సిన్మాలో డైలాగ్‌లాగా దిమాక్ తోడా..చాలా తేడా..బాలయ్య నిజంగానే తేడాసింగ్ అని సినీ జనాలు అంటున్నారు..
