నూతనంగా టీడీపీ తీర్ధం తీసుకున్న ప్రముఖ నటి వాణి విశ్వనాద్ ఇచ్చిన స్టేట్ మెంట్ టిడిపి అదినేతకు బాగానే నచ్చవచ్చు. ఆమె మరో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆమె ఒక హెచ్చరిక చేశారు. ఎన్.టిఆర్ పై ఆయన సినిమా తీయరాదట. ఒక వేళ తీసినా అందులో ఏదైనా తేడా ఉంటే తాను ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ దేవుడు అని, ఆయన రాముడిగా, కృష్ణుడిగా ముద్ర వేసుకున్నారని, అలాంటి ఆయన జీవితం గురించి బాలకృష్ణ సినిమా తీస్తున్నారని ఆమె అన్నారు.తండ్రి కనుక ఎన్.టిఆర్ జీవితాన్ని గొప్పగా దేవుడిలాగానే చూపుతారని ఆమె అన్నారు.కాని వర్మ లక్ష్మీస్ ఎన్.టిఆర్ సినిమా పై అనుమానాలు ఉన్నాయని ఆమె అన్నారు. రాముడి సినిమా తీస్తూ.. రావణ అని, కృష్ణుడి సినిమా తీస్తూ.. కంస అని, గాంధీ సినిమా తీస్తూ.. గాడ్సే అని పేరు పెట్టలేరు కదా.. అంటూ అందువల్ల వర్మ ఆ చిత్రం తీయడం మానుకోవాలని వాణి అన్నారు. అంటే ఎన్.టిఆర్ పై కుటుంబం తిరుగుబాటు చేయడం, ఆయనపై చెప్పులు విసిరిన ఘట్టాలు ఏవీ చూపించరాదని వాణి విశ్వనాద్ అబిప్రాయమా? వామ్మో వాణి విశ్వనాథ్, అనుకుంటూనే వున్నా, ఎంతయినా రోజా మీద పోటీ చేయాలనుకుంటున్నది కదా, ఆ మాత్రం అనకుంటే చంద్రబాబు ఎలా గుర్తిస్తాడు లే అని సోషల్ మీడియాలో కామెంట్స్ తో వైరల్ గా మారింది.
