Home / NATIONAL / మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..

మోదీ సర్కారుపై దీదీ తిరుగుబాటు ..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు.ఆమె మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోనని… కావాలంటే తన నంబర్ ను కట్ చేసుకోవచ్చని ఆమె అన్నారు.

ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నంబర్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. దీనిపై వేసిన పలు కేసులను సుప్రీంకోర్టు ఈ నెల 30వ తేదీన విచారించబోతోంది.

మరోవైపు, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహించనున్నట్టు దీదీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.