Home / POLITICS / ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …

ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి …

ఆధిపత్య రాజకీయాలకోసం హత్యరాజకీయాలకు పాలపడి ఒక్కో గ్రామంలో ఐదునుండి పదిమంది కార్యకర్తలు హత్యకు గురవడానికి కారణభూతులైన నేతలే ఇప్పుడు సూర్యాపేట కేంద్రంగా అఖిలపక్షము అంటూ ప్రజల్ను గందరగోళం పడేసేందుకు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర విద్యుత్ మరియు యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు అఖిల పక్షంగా ఏర్పడ్డ నేతలు చేసిన పరస్పర హత్యారాజకీయాలతో హత్యలకు గురైన కార్యకర్తల ఘోరీలు సూర్యాపేటకేంద్రంగా వారు నెరుపుతున్న రాజకీయాలను చూసి ఘోషిస్తున్నాయాన్నారు. దొంగలు దొంగలు అల్లు పంచుకున్న చందంగా నాడు రాజకీయ అవసరాలకోసమో,ఆధిపత్య రాజకీయాలకోసమో హత్యారాజకీయాలకు పాలపడ్డ ఈ దొంగలు ఓ గుంపుగా ఏర్పడి ఏర్పాటు చేసుకున్నదే అఖిలపక్షమని ఆయన అభివర్ణించారు.

ఇటువంటి ప్రగతివిరోధకుల మాయమాటలకు ప్రలోభపడే స్థితిలో ప్రజలు లేరని,కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలను ఇప్పుడిప్పుడే ప్రజలు అనుభవిస్తున్నారని ఆయన చెప్పారు. బుధవారం రోజున జరిగిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ద అర్వపల్లి యోగానంద లక్ష్మీనరసింహ స్వామీ దేవాస్థాన నూతన పాలకవర్గ ప్రమాంస్వకార్యాకార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్బంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పడు సూర్యాపేటజిల్లా కేంద్రంలో అఖిలపక్షం అంటూ ఏర్పడ్డ ఆ దొంగలవల్లనే ఇంతకాలం తుంగతుర్తిన్ నియోజకవర్గం వెనుకబాటుకు గురైనదని ఆయన ఆరోపించారు.టి ఆర్ యస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో రాజకీయఘర్షణలకు తావు లేకుండా పోయిందన్నారు.

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉనికి కోసం పరితపిస్తున్న ఈ దొంగలు అఖిలపక్షంగా ఏర్పడి విద్వంసాన్ని సృష్ట్టించేందుకు పధకరచన చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పుడు అఖిలపక్షంగా ఏర్పడ్డ నేతలందరూ నిన్నటి వరకు నువ్వు దొంగ అంటే నువ్వే దొంగ అని సంబోదించుకున్నవారే నని ఆయన చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు సూర్యాపేటజిల్లాకు నీళ్లు ఎక్కడినుండి వస్తాయో కూడా తెలువని ఈ దొంగలు కమిషనలకు కక్కుర్తి పడడం వల్లనే యస్.ఆర్.యస్.పి నిర్మాణం నిర్లక్ష్యానికి గురైనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏర్పడ్డ టి ఆర్ యస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే అడుగడుగునా అభివృద్ధికి అడ్డుతగులుతున్నారని ఆయన అన్నారు. 24 గంటలు కాలువల మీద పర్యటించి బయ్యన్నవాగు నుండి నీటిని విడుదల చేపించి సూర్యాపేట జిల్లాలోని వందలాది చెరువులను నింపిన సందర్భాన్ని గుర్తుంచుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తుంగతుర్తి,సూర్యాపేటలకునీళ్లందించే మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణాలను అడ్డుకుందుకు ఈ ప్రబుద్దులున్న పార్టీలు 96 కేసులు వేశారని ఆయన చెప్పారు.
రైతుసమన్వయ సమితిలు ఏర్పాటు చేస్తున్నది రాజకీయాలకోసం కాదని,పండించిన పంటకు రైతు ధర నిర్నయయించేందుకు మాత్రమేనన్నారు. అంతే కాకుండా ప్రతి అయిదు వేల ఎకరాలకు రైతుసమన్వయసమితి కార్యాలయాల ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ఆనాటి ప్రభుత్వాలు రైతులను గాలికి వదిలేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పిటా వెయ్యడమే కాకుండా ధరలు నిర్ణయించుకునే శక్తిని రైతులకు కల్పిస్తున్నామన్నారు. ఎవ్వరు అడ్డం పడిన తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్లందించే ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. ఇప్పటికే నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని,ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలను అమలు పర్చడంతో పాటు చెప్పని కల్యాణలక్ష్మి/షాదిముబారక్,గర్భిణీ స్త్రీలకు 12,000 నగదు,కేసీఆర్ కిట్ లతో పాటు ప్రభుత్వ వసతి గృహాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన అన్నన్ వంటి సంక్షేమ పధకాలను అమలుపరుస్తున్న ఘనత రాష్ట్రప్రబుత్వానిదన్నారు. చెప్పినపద్ధతి లో 17వేల కోట్ల రూ.ల రైతు రుణమాఫీని నాలుగువిడతలలో అమలు పర్చామని ఆయన చెప్పారు. అందుకు కృతజ్ఞతగా నిజామాబాదు నుండి వచ్చిన రైతాంగం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించిన తీరును ఆయన గుర్తు చేశారు

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma