ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు జనసేనలో చేరనున్నారా..? పార్టీ కార్యాలయం ప్రారంభానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాథాకృష్ణన్ వంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ, సురేష్ ప్రొడక్షన్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం. ఆసక్తి రేపుతోంది. సురేక్ష ప్రొడక్షన్లో రూపొందిన గోపాల గోపాల చిత్రంలో పవన్, వెంకటేష్ కలిసి నటించారు.
ఆ సమయంలో దగ్గుబాటి సురేష్‌బాబుతో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. తరువాత కూడా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ మైత్రి కారణంగానే సురేష్ బాబు జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చారా..? లేదంటే జనసేన తరుపున పార్టీలో పనిచేయనున్నారా? అనే ప్రశ్నలకు క్లారిటీ లేదు. సురేష్ బాబు పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోరుతనంగా ఉంటారు. అలాంటి వ్యక్తి సపోర్ట్ జనసేకు ఉంటే అది కచ్చితంగా పవన్ పార్టీకి ప్లస్ అవుతుంది.