కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు గతంలో అప్పటివరకు ఉన్న ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే .ఈ విషయంలో ఇప్పటివరకు కేంద్రంలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,సీపీఎం ,సీపీఐ ,ఎస్పీ ,బీఎస్పీ ,ఎస్పీ ,తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలు మోది సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి .
అయితే తాజాగా కేంద్రంలో గతంలో తీసుకున్న రద్దైన పాత నోట్ల గురించి మరో కీలక ప్రకటన చేసింది. పాత రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను కలిగిఉన్న వారిపై ఎలాంటి క్రిమినల్ చర్యలను తీసుకోబోమని దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు దీనిపై తుది నిర్ణయం ప్రకటించేంత వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది.
పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయనివారిపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కోరుతూ సుధామిశ్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నేడు విచారించింది.అయితే అప్పట్లో పాత నోట్లను కలిగి ఉంటే భారీ జరిమానాలు తప్పవని గతంలో కేంద్రం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఒకరి దగ్గర గరిష్టంగా పది రద్దయిన నోట్ల వరకు మాత్రమే ఉండాలి .అంతకంటే ఎక్కువ మొత్తంలో నోట్లు ఉంటే క్రిమినల్ నేరంగా పరిగణిస్తామని హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే.