పోకిరి సినిమాలోని ఐటెం సాంగ్‌తో ఓ రేంజ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేసింది ముమైత్‌ఖాన్. కానీ ఇప్పుడు ఛాన్సులు లేక.. సినిమాలకు దూరంగా ఉంటోంది. అంతేగాక డ్రగ్స్ కేసులో పోలీసులను ఈ ఐటెం భామను పోలీసులు విచారించారు కూడాను. సినిమాల్లోకి రాకముందు ఎంత దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొందో తెలుసా..? ముమైత్ తల్లిదండ్రులది ప్రేమ వివాహం. అంతేకాదు, వీరికి పాకిస్థాన్. చాలా ఏళ్ల క్రితమే ముంబైకి వలస వచ్చింది వీరి కుటుంబం. ముమైత్‌కు నలుగురు అక్కా చెల్లెళ్లు. ఇక వీరిది మధ్య తరగతి కుటుంబం కావడంతో తండ్రి బాధ్యతలకు తాను కూడా కాస్త సహాయపడాలన్న ఉద్దేశంతో మొమైత్ ఓ డ్యాన్స్ గ్రూప్‌లో చేరి నెలకు రూ.1,500లు సంపాదించేది.
ఇక అక్కడి నుంచే తన ప్రదర్శనను బయటపెట్టడంతో సినీ ఇండస్ర్టీలో శ్రీకారం చుట్టింది. తరువాత తనకు కొన్ని తమిళ సినిమాల్లో ఛాన్సులు రావడంతో అవి చేస్తున్న ముమైత్‌కు పూరీ దర్శకత్వంలో పోకిరి సినిమాలో చేసిన పోకిరి సాంగ్‌తో ఒక్కసారిగా దశ తిరిగింది. అలా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తనకు ఎక్కడా బ్రేకులు పడకుండా సజావుగానే సాగింది. తెలుగులోనే కాదు, హిందీ, కన్నడలో ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించింది.
ఐటెం సాంగ్‌తో బాగా పాపులర్ అయిన నటి ఎవరంటే ముందుగా ముమైత్ పేరే చెబుతారు. కానీ, కొద్ది రోజుల నుంచి తనకు సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో కనుమరుగైపోయింది మొమైత్‌ఖాన్. ఏ ఛాన్సులు లేకుండా ఖాళీగా ఉన్న మొమైత్‌కు బిగ్‌బాస్ షోలో ఆఫర్ రావడంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇలా ఈ షోలో పాటిస్పేట్ చేస్తున్నప్పుడే డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకుని విచారణకు హాజరు కావడంతో హాట్ భామ హాట్‌టాపిక్‌గా మారిందని చెప్పుకోవాలి. తన జీవితంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొని వచ్చినప్పటికీ కూడా తన కెరీర్‌ను ఇలా ఎందుకు నాశనం చేసుకుంటుందోనని ప్రేక్షకులు తనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.