Home / SLIDER / క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే కుట్ర‌ను బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్‌

క‌ల్వ‌కుర్తి ఎమ్మెల్యే కుట్ర‌ను బ‌య‌ట‌పెట్టిన కేటీఆర్‌

కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలు నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వీరంతా గులాబీ కండువాలు కప్పుకుని టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్  చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నదుకు చాలా ఆనందంగా ఉందని అన‌నారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద నాయకుని ఓడించిన ఘనత కల్వకుర్తి నియోజకవర్గానికి ఉంద‌ని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రతి పేదవాడి ముఖలలో చిరునవ్వు చూడడమే సీఎం కేసీఆర్ లక్ష్యమ‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు.

పాలమూరు అంటేనే వలస జిల్లా అంటారని…అయితే అలా కాకుండా సీఎం కేసీఆర్ చూస్తున్నారని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. పాలమూరు జిల్లా మొత్తం సగటున లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చామ‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. కల్వకుర్తిలో ఫార్మాసిటీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామంటే స్థానిక ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని మంత్రి వివ‌రించారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విధంగా లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు తప్పుడు మాటలతో కేసులు వేస్తున్నారని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. ఇంటింటికి ఆరు కిలోల బియ్యం, ప్రతి పేద పిల్లలకు సన్న బియ్యం, పేద ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్‌ ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఘ‌న‌త అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఒకప్పుడు అందరూ పదవులు అనుభవించిండ్రు తప్ప అభివృద్ధి పనులు చేయలేదని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని ప్ర‌క‌టించిన ఘ‌నత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి వివ‌రించారు. రైతన్నలను దృష్టిలో ఉంచుకొని 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంది తెలంగాణా ప్రభుత్వం అని తెలిపారు. వచ్చే రబీ నుంచి ఎకరానికి 4 వేలు చొప్పున రెండు పంటలకు 8 వేలు ఇస్తున్న నాయకుడు మన సీఎం కేసీఆర్ అని వెల్ల‌డించారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినప్పుడు పనులు చేసింది లేదు కానీ ఇప్పుడు మళ్లీ ఒకసారి గెలించడని అడుగుతున్నారని మంత్రి కేటీఆర్ వివ‌రించారు. అందరం కలిసి సీఎం కేసీఆర్ దారిలో నడుస్తూ బంగారు తెలంగాణాలో భాగస్వాములవుదామ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు.

Image may contain: 18 people, people smiling, people sitting and indoorImage may contain: 5 people, crowdImage may contain: 26 people, people sitting and crowdImage may contain: 9 people, people smiling, people standing and indoor

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat