క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ సినిమాపై మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతోంది. అంతగా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పాటల కోసం ఆరాటపడుతున్నారు. ఈ క్లాసికల్ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీత ఎలా ఉంటుందో వినాలని తహతహలాడుతున్నారు.
అయితే, తాజా సమాచారం మేరకు, చిత్ర దర్శకుడు సుకుమార్ మెగా అభిమానుల కోసం ఓ మెగా టీజర్‌ను రిలీజ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీజర్‌కు సంబంధించి ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఈ మూవీకి సంబంధించిన స్టిల్స్‌కానీ.. వీడియోస్‌కానీ ఏవీ బయటకు రాకపోయే సరికి ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్‌లో ఉన్నారు.
అందుకే సుకుమార్ వారి కోసం ఒక మెగా టీజర్‌ను తీసుకురానున్నారట. సమంతకు జోడీగా సమంత నటిస్తుండగా.. అనసూయ ఓ కీలక రోల్‌లో కనిపించబోతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్‌లో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.