తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇటు అధికార అటు ప్రతిపక్షాల మధ్య చర్చ వాడివేడిగా జరుగుతుంది .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పలు అంశాల గురించి ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి .ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభలో ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పక్ష సభ్యులు రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నాయి అని ..అభివృద్ధి ఏమి జరగడంలేదు అని ఆరోపించారు .
దీనికి సమాధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు .ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ బరాబర్ అప్పులు చేస్తాము .కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న ఈ మాత్రం అప్పులు చేయాలి .ప్రపంచాన్ని శాసించే దేశమైన అమెరికా కూడా అప్పులు చేస్తుంది .
అందుకే అమెరికా దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది .రాష్ట్రంలో పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవ్వడానికి ..రాష్ట్రంలో ఉన్న త్రాగునీటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావడానికి బాజాప్త అప్పులు చేస్తాం ..ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల యాబై నాలుగు కోట్ల రూపాయల అప్పులు చేసింది అని మంత్రి పేర్కొన్నారు .