Home / MOVIES / అర్ధ గంటకి పన్నెండు కోట్లు ..

అర్ధ గంటకి పన్నెండు కోట్లు ..

ఆమె ఇటు బాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు మంచి ఫాలోయింగ్ ఉన్న అందాల రాక్షసి .ఒకపక్క తన అందంతో యువతను ,సినిమా ప్రేక్షకుల గుండెల్లో దేవతగా గుడి కట్టుకున్న అమ్మడు నటనతో అందరి మదిలో చెరగని ముద్ర వేసుకుంది ప్రియాంక చోప్రా .తాజాగా అమ్మడు కేవలం అర్ధగంట కార్యక్రమానికి పన్నెండు కోట్లు డిమాండ్ చేస్తుంది .

అంత డిమాండ్ ఉంది కాబట్టే అమ్మడు ఈ మధ్యనే లండన్ లో ఒక ఇల్లును కూడా కొన్నది అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఇలాంటి తరుణంలో తాజాగా ఈ అందాల రాక్షసికి ఒక మంచి బంపర్ ఆఫర్ వచ్చింది .అదే డిసెంబర్ నెలలో జరగనున్న ఒక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో డాన్స్ చేయబోతుంది .

అయితే అది పెద్ద ఆఫర్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ఆ వేడుకలో దాదాపు కేవలం ముప్పై నిమిషాలు అంటే అర్ధగంట పాటు డాన్సు వేయడానికి ప్రియాంకకు నిర్వాహకులు పన్నెండు కోట్లు ఆఫర్ ఇచ్చారు అంట .ఇది అసలు మ్యాటర్ ..