ఏపీలో శోఖాన్ని నింపిన కృష్ణా బోటు ప్రమాదం.. ప్రభుత్వశాఖల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదంలో 22 మంది మృతిచెందారని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో శాఖాపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామా చేసేవారని.. మరి తాజా ఘటనకు బాధ్యత వహించాల్సిందే అని అఖిలప్రియను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ఆమె కంగుతిన్నారు. అంతేకాదు సహచర మంత్రులు, అధికారుల సమక్షంలో చంద్రబాబు సూచనలు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ఘటనకు నైతిక బాధ్యత తీసుకోవాలని.. అవసరమైతే రాజీనామా చేయాలని చంద్రబాబు అన్నట్టు టీడీపీ వర్గీయులే చర్చించుకుంటున్నట్టు సమాచారం.
ఇక మరోవైపు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ పై నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఆమె చాలా సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. సోషల్ మీడియా సమ్మిట్, బెలూన్ ఫెస్టివల్ లను నిర్వహించడంతో పాటు, వివిధ కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని అఖిలప్రియ ప్రోత్సహించారని చెప్పారు. కేబినెట్ నుంచి అఖిలప్రియను తొలగిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. విజయవాడలో చోటు చేసుకున్న బోటు ప్రమాదం దురదృష్టకరమని.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారని.. ప్రమాదానికి బాధ్యులైన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. దీంతో తండ్రి ఒక మాట.. కొడుకు ఒక మాట చెప్పడంతో అఖిల ప్రియకు మైండ్ బ్లాక్ అయ్యిందట.. అసలు తనకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తోందని అస్సలు ఊహించలేదని.. టీడీపీలో చేరి చాలా పెద్ద తప్పు చేశానని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.