ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.ఈ నేపధ్యంలో అయన మంత్రి నారా లోకేష్ పై పోసాని మండిపడ్డారు …”లోకేష్, మీకేమైనా బుద్ధి, జ్ఞానం ఉందా? చదువుకున్నారా?” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మీరు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా… ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని సూచించారు. మీలాంటి నేత ఉమ్మడి ఏపీలో ఉండి ఉంటే తాము నాశనం అయ్యావారమని చెప్పారు. నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా ? చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయలేదా ? అని విమర్శించారు .నంది అవార్డులను విమర్శించినంత మాత్రాన తమను నాన్ లోకల్ అంటారా అంటూ మండిపడ్డారు.తనకు ఈ అవార్డు వద్దని… ఒకవేళ తీసుకుంటే, ‘కమ్మోడు కాబట్టి వీడికి అవార్డు ఇచ్చారు’ అంటారని అన్నారు . కావాలంటే లోకేష్ పేరిట బంగారు నంది అవార్డులు ఇచ్చుకోండని అన్నారు. ఇలాంటి వివాదాలు వస్తే తాను చచ్చే వరకు నంది అవార్డులు తీసుకోనని ప్రకటించారు.
