ఎక్కడైనా ప్రజలను మోసం చేస్తే ఏ ప్రభుత్వానికి అయినా పతనం తప్పదని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ ప్రభుత్వానికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బేతంచర్లలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించామని, అలాగే ఆయా జిల్లాల వారిగా…జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు.సుమారు గంటపాటు చిట్‌చాట్ చేసిన వైఎస్ జగన్…‘ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది. హోదాతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని జగన్ అన్నారు.
