అనసూయ.. ప్రస్తుతం టాలీవుడ్‌లో బుల్లితెర, వెండితెరలపై బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్. అంతేకాదు, తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో లేడీ యాంకర్లకు ఇతర నటులతో, తోటి యాంకర్లకు ఎఫైర్ అంటగడుతున్న ఈ రోజుల్లో.. అనసూయ మాత్రం కాంట్రవర్సీలకు ఆమడ దూరంలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీలు వచ్చిన వారి జాబితాలో రష్మీని – సుధీర్‌తో, శ్రీముఖిని – రవిలు ఉన్నారు. వీరి మధ్య ఎఫైర్ పీక్ స్టేజ్‌కి వెళ్లిందంటూ పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను ఆసరాగా చేసుకున్న పలు టీవీ యాజమాన్యాలు తమ రేటింగ్ పెంచుకునేందుకు వీరిపై ప్రోగ్రామ్‌లను కూడా టెలికాస్ట్ చేశారు. అయితే తరువాత కాలంలో అవన్నీ పుకార్లని తెలిపోయిన విషయం తెలిసిందే.
అయితే, ఇటీవల అనసూయ నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. మీరు ఓ తల్లి అయి ఉండి కూడా.. అన్ మ్యారీడ్ గాల్‌గా కనిపిస్తారు. ఈ మధ్యన మీకు అందం మరీ ఎక్కువ అయింది.. మీ అందం రహస్యమేంటని ప్రశ్నించింది.
ఇందుకు స్పందించిన అనసూయ.. జస్ట్ టెంప్టేషన్స్ తగ్గించుకోవాలంది. నాక్కూడా స్వీట్స్ అంటే పిచ్చ ఇష్టం. ఈ రోజు కూడా నేను రెండు పెద్ద చాక్లెట్లు తిన్నా. అయితే, తిన్నవి ఎలా అరిగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఏ టైమ్‌లో చేయాల్సినవి ఆ టైమ్‌లోనే చేయాలి. ప్రతి రోజూ 30 నిమిషాలు శారీరక వ్యాయామం కోసం పాటించాలి. అన్ మ్యారీడ్, మ్యారీడ్ అనేది జస్ట్ ఒక పేజ్ ఆఫ్ లైఫ్ అండి అంతే. అంటూ సమాధానం ఇచ్చింది.