ఈ ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి, మెగా హీరోల సినిమాలు ఉన్నప్పటికీ శర్వానంద్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన శతమానం భవతి చిత్రాన్ని రిలీజ్ చేసి హిట్ కొట్టాడు నిర్మాత దిల్‌రాజు. అయితే, శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నెష్ మరో స్ర్కిప్ట్‌తో దిల్‌రాజు వద్దకు వచ్చాడని, ఆ స్ర్కిప్ట్‌ను కాస్తా దిల్‌రాజు ఎన్టీఆర్‌కు వినిపిండచంతో.. అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడని అప్పట్లో వార్తలు షికారు చేశాయి. అయితే ఆ స్ర్కిప్ట్‌కు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. దర్శకుడిగా సతీష్ వేగ్నేష్‌కు నో చెప్పాడట. శతమానం భవతి వంటి హిట్ ఇచ్చినప్పటికీ సతీష్ వేగ్నేష్‌పై ఎన్టీఆర్‌కు నమ్మకం కలగకపోవడమే అందుకు కారణమట.
కాగా, స్ర్కిప్ట్‌తో పక్కా ప్లానింగ్‌తో ఉన్న దర్శకుడు వేగ్నేష్‌ను మార్చితే.. సినిమా రూపాంతరం మారుతుందని భావించిన దిల్‌రాజ్.. దర్శకుడ్ని మార్చాలని కోరిన ఎన్టీఆర్.. కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అంతేగాక, సతీష్ వేగ్నేష్‌తోనే తన బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించాలని ఫిక్సయ్యాడట. ఇక ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో వెంటనే నితిన్‌ను సంప్రదించగా.. స్ర్కిప్ట్ విన్న నితిన్ వెంటనే ఓకే చెప్పాడనే టాక్ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తను నిజం చేస్తూ నితిన్.. దిల్‌రాజు నిర్మాణంలో.. సతీష్ దర్శకత్వంలో తాను శ్రీనివాస కల్యాణం చిత్రం చేస్తున్నానని సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించాడు. వీరి కాంబోలో తెరకెక్కనున్న శ్రీనివాస కల్యాణ్ం వచ్చే ఏడాది మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే, 14 ఏళ్ల తరువాత తిరిగి దిల్‌రాజుతో సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాప్పీగా ఉందంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు నితిన్. ఈ మూవీకి మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు.