అందాల రాక్షసికి మళ్లీ కోపమొచ్చింది. అదేనండీ లావణ్య త్రిపాఠికి, తెలుగులో నటించిన తొలి చిత్రం తోనే కుర్రకారుని కట్టిపడేసిన ఈ భామ. ఇక ఆ తర్వాత దూసుకెళ్తా నుండి తాజాగా విడుదల అయిన ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దగ్గరైంది. మొన్నటి వరకు చీరలతో.. అరెరే మన పక్కింటి అమ్మాయిలా ఉందే అనేలా వెండి తెరపై కనిపించిన ఈ భామ.. ఇప్పుడు ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారుకు దగ్గరవుతోంది.
అయితే ఈ మధ్య లావణ్యకు పెద్దగా కలిసిరావడంలేదు. ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. మిస్టర్, రాధ, యుద్ధం శరణం సినిమాలు లావణ్యకు పెద్దగా పేరేమి తెచ్చిపెట్టలేదు. లావణ్య తాజాగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఉన్నది ఒకటే జిందగీ చిత్రంలో లావణ్య నటన.. ఫేస్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
అయితే, ఓ సినిమా విషయంలో లావణ్యకి తమిళ నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చిందని, తెలుగులో వచ్చిన 100% లవ్ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ రీమేక్ చిత్రం నుంచి తప్పుకోవడంతో తమిళ నిర్మాతల మండలి లావణ్యకు 3 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఇక, ఈ విషయంపై తాజాగా స్పందించిన లావణ్య త్రిపాటి.. మౌనంగా ఉంది కదా అని తన గురించి ఏది పడితే అది రాస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది. నాపై మీరెన్ని పుకార్లను సృష్టించినా.. అవేవీ నాపై ప్రభావం చూపవు. నాకు తృప్తినిచ్చే కథలను ఎంచుకుంటా. నన్ను ఉత్సాహపరిచే చిత్రాల్లోనే నటిస్తా అంటూ చెప్పుకొచ్చింది.