ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్ అశోక్‌కుమార్, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
గువ్వల శ్రీకాంత్‌రెడ్డి టీడీపీకి తీరని ద్రోహం చేశారన్నారు. పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరి జడ్పీ చైర్మన్ పదవి టీడీపీకి రాకుండా చేశార న్నారు. తిరిగి అతనిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని జిల్లా నాయకులను ప్ర శ్నించామన్నారు. ఇదే విషయంపై జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మంత్రి కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎమ్మె ల్సీ శమంతకమణి, జేసీ పవన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
దీనిపై అధిష్టానంతో మాట్లాడి పార్టీలోకి చేర్చుకునే అంశంపై వివరిస్తామన్నారు. స్థానిక సమస్య, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు వారి అబిప్రాయాలును వివరిస్తామని జిల్లా నేతలు హమీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎస్ నారాయణస్వామి, సర్పంచ్‌లు రామానాయుడు, ఆదిశేషు, మాజీ సర్పంచ్ జొన్నారామయ్య, లక్ష్మీనారాయణ, కేశన్న, ఎంపీటీసీ ఆర్ నారాయణస్వామి,
సోమశేఖర్, మల్లిఖార్జునరెడ్డి పాల్గొన్నారు.