రాష్ట్రంలోని సూర్యాపేటజిల్లాలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఆదర్శ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనే 63 ఎస్సీ కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దళితవాడల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని మంత్రి ఉద్ఘాటించారు.
