తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు .
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం ఢిల్లీ కి అఖిలపక్షం..పార్లమెంటు లో బిల్లు కోసం కేంద్రం పై ఒత్తిడి తీసుకొస్తాం ..కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి ..బీసీ ల అభ్యున్నతి కోసం అద్భుత బాటలు వేద్దాం ..అందరితో చర్చించి విధానాలు రూపొందించండి..
మీరు సిఫారసు చేయండి ..నేను అమలు చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ విషయం మీద మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు .ఇలాంటి ముఖ్యమంత్రి ని ఇప్పటివరకు నేను చూడలేదు .బీసీల కోసం ఇంతగా ఆరాటపడే నేతను కేసీఆర్ లోనే చూస్తున్న .. కేసీఆర్ బీసీ ల కోసం పడే తాపత్రయం చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు ..